![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'.ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -880 లో.. వసుధార దగ్గరికి శైలేంద్ర వచ్చి.. వసుధారకి కోపం వచ్చేలా మాట్లాడతాడు. నీ నిజస్వరూపం ఇంక బయటపెట్టడం లేదని దాన్ని అలుసుగా తీసుకోవడం మంచిది కాదని వసుధార అంటుంది. అప్పుడే వాళ్ళిద్దరి దగ్గరికి రిషి వస్తాడు. ఇక్కడేం చేస్తున్నారని రిషి అడుగుతాడు. అది ఎలా జరిగిందని అడుగుతున్నానని, నీకేం కాలేదు కదా రిషి అని శైలేంద్ర యాక్టింగ్ చేస్తాడు.
ఆ తర్వాత వసుధార ఏదో చెప్పబోతుంటే.. రిషి ఆపి పదండి అక్కడికి వెళదామని అంటాడు. మరొకవైపు రిషికి నిజం చెప్పాలని ఒక లెటర్ లో జరిగిందంత జగతి రాసి రిషి చేస్తున్న కాలేజీకీ పోస్ట్ చేస్తుంది. అలా పోస్ట్ చేసిన ఆ లెటర్ కాలేజీ లోకి వస్తుంది. అటెండర్ తీసుకొని వచ్చి లెటర్ ని ప్రిన్సిపల్ కి ఇవ్వగా రిషి వచ్చాక ఇద్దామని ఓపెన్ చెయ్యకుండా తన టేబుల్ దగ్గర పెడతాడు. మరొకవైపు దేవయాని భుజాలపై రిషి పడుకొని.. జగతి పట్ల తను ప్రవర్తించిన తీరుని గుర్తుచేసుకొని బాధపడతాడు. నా కన్నతల్లి అన్న విషయం మర్చిపోయి చాలా బాధపెట్టానంటూ రిషి ఎమోషనల్ అవుతుంటాడు. నా తల్లికి ఏం కాదు కదా పెద్దమ్మ అని రిషి ఎమోషనల్ గా అడుగుతుంటే.. అందరు ఎమోషనల్ అవుతారు. లోపల జగతి చెడు కోరుకుంటూ బయటకు జగతికి ఏం కాదంటూ రిషికి దేవయాని దైర్యం చెప్తుంది. ఏం ఇచ్చి నా తల్లి ఋణం తీర్చుకోవాలని రిషి అంటాడు.
ఆ తర్వాత అసలు ఇదంతా ఎవరు చేశారని మహేంద్రని ఫణీంద్ర అడుగుతాడు. మహేంద్ర చెప్పకుండా శైలేంద్ర డైవర్ట్ చేస్తాడు. ఆ తర్వాత పోలీసులు హాస్పిటల్ దగ్గరికి వచ్చి రిషితో మాట్లాడతారు. సీసీ టీవీ ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నామంటూ SI చెప్తాడు. ఆ తర్వాత శైలేంద్రకి రౌడీ ఫోన్ చేసి డబ్బులు కావాలని అడుగుతాడు. సరే నేనే వచ్చి డబ్బులు ఇస్తానని కోపంగా రౌడీతో మాట్లాడతాడు శైలేంద్ర. ఆ తర్వాత వసుధారతో రిషి తన మనసులో జగతి పట్ల ఉన్న ప్రేమని చెప్తాడు. ఇన్ని రోజులు అమ్మ అని పిలవలేదు కానీ ఇప్పుడు స్పృహలోకి వస్తే, వచ్చినప్పటి నుండి నా జీవితం మొత్తం అమ్మ అనే పిలుస్తానంటూ రిషి ఎమోషనల్ గా వసుధారతో చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |